రాయలసీమ వర్సిటీలో క్వాంటం విజ్ఞాన కెరటం

 కర్నూలు: రాయలసీమ & క్లస్టర్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై నిర్వహిస్తున్న 6 రోజుల శిక్షణా తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఐఐటీడీఎం అసోసియేట్ ప్రొఫెసర్ డా డి. మురళి 'క్వాంటం సిమ్యులేషన్స్'పై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉపకులపతి ఆచార్య వెంకట బసవరావు ఆయనను సన్మానించారు.

ఫోటో 

మధ్యాహ్నం సెషన్‌లో ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జి. భగవన్నారాయణ క్వాంటం అల్గారిథమ్స్ గురించి, డా పవన్ వేణు ప్రకాష్ క్వాంటం మెటీరియల్స్ గురించి వివరించారు. ఉన్నత విద్యలో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఆచార్య సుందరానంద పుచ్చ, డా ఎం. పద్మావతి, డా యం వాయిజ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments